Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

ట్రాన్స్‌ఫార్మర్ పేలి… 14 మంది మృతి

Transformer-Explodes-in-Sha

జైపూర్: రాజస్థాన్ రాజధాని జైపూర్‌లోని షాపూర పట్టణ సమీపంలోగల ఖటులై అనే గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడంతో 14 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 20 మంది వరకు గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం… ఖటులై గ్రామంలో ఓ ఇంట్లో పెళ్లి వేడుకలు జరిగాయి. వేడుకల అనంతరం కుటుంబ సభ్యులు, బంధువులు రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా ట్రాన్స్‌ఫార్మర్ పేలింది. దీంతో 14 మంది చనిపోగా, 20 మంది వరకు గాయపడ్డారు. దీంతో క్షతగాత్రులను చికిత్స కోసం ఎస్‌ఎంఎస్ ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో మరికొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి పుష్పెంద్ర సింగ్. అంతేగాక ఓ ప్రత్యేక కమిటీని కూడా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం తరపున మృతుల కుటుంబాలకు ఒక్కొక్కరికి రూ. 10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వారిని ముఖ్యమంత్రి వసుంధర రాజే పరామర్శించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

14 Killed, 20 Injured in Transformer Explodes in Shahpura near Jaipur.

Comments

comments