Home అంతర్జాతీయ వార్తలు పాక్ లో ఆత్మాహుతి దాడి: 14 మంది మృతి

పాక్ లో ఆత్మాహుతి దాడి: 14 మంది మృతి

14 Members Died in Suicide Attack in Pakistan

ఇస్లామాబాద్: పాకిస్థాన్‌లోని పెషావర్‌లో ఎన్నికల ర్యాలీలో బుధవారం తీవ్రవాదులు ఆత్మాహుతి దాడి జరిపారు. ఈ దాడిలో 14 మంది ఘటనా స్థలంలో దుర్మరణం చెందగా, 51 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రులకు తరలించారు. మృతుల్లో అవామీ జాతీయ పార్టీకి చెందిన హరూన్ బిలోర్ కూడా ఉన్నట్టు సమాచారం.  జులై 25న పాకిస్థాన్‌లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. భద్రతా బలగాలు, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తు చేస్తున్నాయి. ఈ దాడి జరిపింది తానేనని ఏ సంస్థ ఇప్పటివరకు వెల్లడించలేదు.