Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

కల్తీ కల్లోలానికి 14 మంది బలి

 Addicted-liquorఒక్క మహబూబ్‌నగర్ జిల్లాలోనే కల్తీ కల్లుకు అలవాటు పడిన పది మంది మృతి

మన తెలంగాణ న్యూస్ నెట్‌వర్క్
కల్తీ కల్లోలానికి మం గళవారం ఒక్క రోజే14నిండు ప్రాణాలు బలైపోయాయి. వీరిలో10మంది మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన వారు కాగా, మెదక్‌కు చెందిన ముగ్గురు, కరీంనగర్ జిల్లా జగి త్యాల వాసి ఒకరు ఉన్నారు. వీరిలో ఐదుగురు ఆత్మహ త్య చేసుకోగా, ఇందులో ముగ్గురు మహిళలు. కల్తీ కల్లు కు అలవాటు పడి, ఇప్పుడది దొరకకపోవడం కల్లు బాని సలకు శరాఘాతంగా మారింది. కల్తీకల్లు బానిసలు అది లేక వింత, పిచ్చి చేష్టలు, మూర్ఛపోయి, గాయాలపాలై, అనారోగ్యానికి గురై మృత్యువాత పడుతున్నారు. ఈ విధ ంగా అర్ధాంతరంగా ప్రాణాలు కోల్పోయిన వారిలో ఒక్క షాద్‌నగర్ నియోజకవర్గంలోనే ఎనిమిది మంది ఉండడం అందరిని కలవరపె డుతోంది. షాద్‌నగర్ పట్టణం లోని ఇంద్రానగర్‌కు చెందిన భీమమ్మ (60),ఫరూఖ్ నగర్ మండలం కిషన్‌నగర్‌కు చెందిన సాలే యాదగిరి (60), కొందుర్గు మండలం చెన్నారెడ్డిగూడ వాసి కడ మంచి పెంటమ్మ (58), గద్వాల పట్టణంలోని వేదన గర్‌లో నివసించే తాయప్ప భార్య సత్తెమ్మ (35), మెదక్ జిల్లా సదాశివపేట మండలం నందికంది గ్రామానికి చెందిన కిష్టయ్య (40) ఆత్మహత్య చేసుకున్నారు. షాద్‌న గర్ విజయనగర్ కాలనీకి చెందిన లక్ష్మమ్మ (57), ఫరూఖ్‌నగర్ మండలం లింగారెడ్డిగూడ వాసి ఖాజామి యా(57), కొత్తూరు మండలానికి చెందిన బాబుమియా (75) మూర్ఛపోయి, ఇదే మండలం ఇన్ముల్‌నర్వ గ్రామ వాసి మంగలి శాంతమ్మ(70), కర్రోళ్ల పెంటమ్మ(65) కల్లు తాగి అనారోగ్యం పాలై ప్రాణాలు విడిచారు. అలాగే, గద్వాల పట్టణంలోని గంజిపేటకు చెందిన అబ్దు ల్‌సలా (55), కరీంనగర్ జిల్లా జగిత్యాలకు చెందిన రిక్షా కార్మికుడు మొయినుద్దీన్, మెదక్ జిల్లా కల్హేర్ మండలం బాచేపల్లి వాసి గంజాయి రాములు (50), సదాశివపేట మండలం సిద్ధాపూర్‌కు చెందిన నాగరాజు (27)కల్తీ కల్లుకు బానిసలుగా మారడంతో తీవ్ర అనారోగ్యానికి గు రై మృతి చెందారు. కల్తీ కల్లుకు బానిసలుగా మారిన పలు వురు వింత ప్రవర్తన, పిచ్చిచేష్టలతో ఆస్పత్రి పాల య్యారు. ఇటువంటి వారితో వనపర్తి, షాద్‌నగర్ ప్రభు త్వాసుపత్రులు నిండిపోయాయి. వనపర్తి ఆస్పత్రిలో మ ంచాల కొరత కారణంగా ఒక్కొక్క దానిని ఇద్దరిద్దరికి కేటాయించాల్సిన పరిస్థితి నెలకొంది.
వీరిలో కొందరి పరిస్థితి మరింత ముదరడంతో కాళ్లు, చేతులను తాళ్లతో బంధించి వైద్య సహాయం అందించాల్సి వస్తుంది. అయి తే, పట్టణంలో పలుచోట్ల కల్లు విక్రయాలు యధేచ్ఛగా కొనసాగుతుండడం పట్ల ప్రజలు ఆందోళన చెందుతు న్నారు. అదేవిధంగా జగిత్యాల మండలం మోతె, మెదక్ జిల్లా నారాయణఖేడ్ మండలం హన్మంత్‌రావుపేట, ఖాంజీపూర్, నిజాంపేట గ్రామాలకు చెందిన పలువురు కల్తీ కల్లు తాగి అనారోగ్యంతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరారు.

Comments

comments