Home తాజా వార్తలు మరో 14వేల డబుల్ ఇళ్లు..

మరో 14వేల డబుల్ ఇళ్లు..

 14 thousand double BedRoom homes
14 thousand double BedRoom homes

ఊపందుకోని డబుల్ ఇళ్ల నిర్మాణం
2.74 లక్షలకు పదివేలే పూర్తి

మన తెలంగాణ/హైదరాబాద్ : అదనంగా 14,116 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇప్పటివరకు మంజూరు చేసిన ఇండ్ల సంఖ్య 2,74,116కు చేరుకుంది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్, 30 జిల్లాలకు కలిపి మంజూరు చేసిన డబుల్ ఇండ్ల సంఖ్య అంతకు ముందు 2.60లక్షలుగా ఉంది. ఇప్పుడు కొత్తగా మం జూరు చేసినవన్నీ వివిధ జిల్లాలకు చెందినవే. కొన్ని జిల్లాల్లో ముందుగా చేసిన కేటాయింపుల్లో కోత విధించింది. ఇటీవల జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డబుల్ బెడ్‌రూ మ్ ఇండ్ల నిర్మాణంపై సిఎం కె. చంద్రశేఖర్‌రా వు మాట్లాడుతూ 3 లక్షల ఇండ్లు నిర్మిస్తామని ప్రకటించారు.అందులో భాగంగానే 14 వేల ఇండ్ల మంజూరుకు ప్రభుత్వం నుంచి పూర్తిస్థాయిలో ఆమోదం లభించింది. జిల్లాల కలెక్టర్ల నుంచి అందే ప్రతిపాదనలకు అనుగుణంగా త్వరలోనే ఈ సంఖ్యను 3 లక్షలకు పెంచే అవకాశం ఉన్నట్లు గృహనిర్మాణ సంస్థ అధికారి ఒకరు చెప్పా రు. మొత్తం జిల్లాల్లో 1,74,116 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించేందుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతించగా, జిహెచ్‌ఎంసి పరిధిలో లక్ష ఇండ్లను కేటాయించింది.ఈరెండింటిలో కలిపి2,47,232 ఇండ్లకు జిల్లా కలెక్టర్లు పరిపాలన అనుమతులు మంజూరు చేయగా, 1,83,711 ఇండ్లకు టెండర్లు ఖరారు చేశారు. వీటి లో 1,56,829 ఇండ్లు నిర్మాణ దశలో ఉండగా, 10,664 (జిల్లాల్లో 10,092, జిహెచ్‌ఎంసి పరిధిలో 572) డబుల్ ఇండ్లు పూర్తయ్యా యి. ఇందుకు ఇప్పటి వరకు మొత్తం రూ. 2,110 కోట్లు ఖర్చు చేశారు.
సమన్వయ లోపం.. స్టీల్ కొరత : స్టీల్ ఉత్పత్తిదారులు అనుకున్న మేర అవసరమైన స్టీల్‌ను సరఫరా చేయకపోవడంతో డబుల్ బెడ్‌రూమ్ ఇండ్ల నిర్మాణం ఆశించినంత వేగంగా జరగడంలేదు. మొత్తం 2.74 లక్షల ఇండ్లలో 10,664 అంటే 4 శాతమే పూర్తి స్థాయిలో నిర్మాణమయ్యాయి.11జిల్లాల్లో ఒక్క డబుల్ బెడ్‌రూమ్ ఇంటి నిర్మాణం కూడా పూర్తికాలేదు. గత నెలలో మార్కెట్ ధర కన్నా టన్ను కు రూ. 9,440 తక్కువ చొప్పున దాదాపు 80 వేల టన్నుల స్టీల్ సరఫరాకు కంపెనీలు అంగీకరించినా సరఫరా చేయలేకపోయాయి. దీంతో నిర్దేశించుకున్న లక్ష్యానికి అనుగుణంగా డబుల్ ఇండ్ల నిర్మా ణం కొనసాగడం లేదని అధికారులే స్వయంగా అంగీకరిస్తున్నారు. ఈ కొరత నివారించేందుకు స్టీల్ ఉత్పత్తిదారులు, రెండు పడక గదుల నిర్మాణ కాంట్రాక్టర్లు మధ్య సమన్వయం చేయాలని నిర్ణయించారు. కొన్ని జిల్లాల్లో ఇప్పటికీ లబ్దిదారులను గుర్తించలేదు.