Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

14 ఏళ్ల  నితిన్!

Nithinటాలీవుడ్‌లో ప్రస్తుతం మంచి జోష్ మీదున్న యంగ్ హీరో నితిన్. ఇప్పుడు ఈ కథానాయకుడు తన కెరీర్‌లో 14 ఏళ్లు పూర్తిచేసుకున్నాడు. తొలి సినిమా ‘జయం’ విడుదలై 14 ఏళ్లు గడిచిదంటూ ట్వీట్ చేసిన నితిన్… అప్పటి రోజులను గుర్తుచేసుకున్నాడు. “14 ఏళ్ల క్రితం జూన్ 14న నేను సినీ ప్రపంచానికి ‘జయం’ సినిమా ద్వారా పరిచయమయ్యాను. ఇదో అద్భుతమైన ప్రయాణం. తేజ సార్‌కు థాంక్యూ. నాకు అండగా నిలిచిన ప్రతి అభిమానికి కృతజ్ఞతలు”అంటూ ట్వీట్ చేశాడు నితిన్. 2002లో జూన్ 14న విడుదలైన జయం సినిమా ద్వారా అతను తెరంగేట్రం జరిగింది. ఆ సినిమా హిట్ తర్వాత వి.వి.వినాయక్ డైరెక్షన్‌లో వచ్చిన ‘దిల్’ చిత్రం నితిన్‌ని టాలీవుడ్‌లో స్థిరపడేలా చేసింది. 2004లో వచ్చిన రాజమౌళి ‘సై’ చిత్రంతో అతని కెరీర్ పీక్స్‌కి వెళ్లిపోయినా… ఆతర్వాత ఇబ్బందులు పడ్డాడు ఈ యంగ్ హీరో. 8 ఏళ్ల పాటు ఒక్క హిట్ లేకుండానే 12 సినిమాలు చేశాడు నితిన్. మళ్లీ 2012లో ఇష్క్ సినిమా నుంచి సక్సెస్ బాట పట్టాడు. అక్కడి నుంచి కెరీర్‌ను జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాడు. గత ఏడాది ‘అఖిల్’ సినిమాతో నిర్మాతగా ఇబ్బందులుపడ్డా… తాజాగా ‘అ..ఆ’ మూవీతో హీరోగా కెరీర్‌లో ఉన్నత స్థానానికి చేరుకున్నాడు. ఈ సినిమాతో తొలిసారిగా 50 కోట్ల క్లబ్‌లోకి చేరడానికి చేరువయ్యాడు నితిన్.

Comments

comments