Home తాజా వార్తలు హిందూపురంలో ఉద్రిక్తత : 144 సెక్షన్ అమలు

హిందూపురంలో ఉద్రిక్తత : 144 సెక్షన్ అమలు

Balakrishna-Hindupuramఅనంతపురం : సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ నియోజకవర్గం హిందూపురంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. బాలకృష్ణ సెక్రటరీ శేఖర్ తీరుపై కొన్ని రోజులుగా టిడిపిలో విభేధాలు ఏర్పడి కొందరు నాయకులు సమావేశాలు, నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. మరోపైపు శేఖర్ వర్గీయులు కూడా ప్రదర్శనలు చేస్తున్నారు. దీంతో వివాదం మరింత ముదిరింది. కాగా ఆదివారం శేఖర్ వర్గీయలు, వాళ్ల వ్యతిరేకులు మరోసారి నిరసన చేపడతామని ప్రకటించడంతో పోలీసులు 144 సెక్షన్ విధించారు. పట్టణంలో ఎలాంటి సమావేశాలు, నిరసన కార్యక్రమాలు నిర్వహించరాదని స్పష్టం చేశారు.