Search
Wednesday 26 September 2018
  • :
  • :

రైలులో 14 మంది గిరిజన బాలల అక్రమ తరలింపు

14children rescued from running train in jharkhand

రూర్కెలా:  14 మంది గిరిజన బాలలను రైలులో అక్రమంగా తరిలిస్తున్న 53 ఏళ్ల ఎ సెల్వరాజ్‌ ను రూర్కెలా ప్రభుత్వ రైల్వే పోలీసులు అరెస్ట్ చేశారు. 14 మంది లో నలుగురు అబ్బాయిలు, 10 మంది అమ్మాయిలు ఉన్నారు. 14 మందిని టాటా అల్లెపి ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లో తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. బాలలందరూ జార్ఖండ్ లోని పశ్చిమ  సింగ్‌భమ్ జిల్లా కరైకేలా ప్రాంతానికి చెందినవారుగా పోలీసులు గుర్తించారు.  నిందితుడిపై  కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Comments

comments