Search
Wednesday 14 November 2018
  • :
  • :

15 కార్లను కాల్చి బూడిద చేసిన డాక్టర్!

Acussed

బెంగళూరు: కర్ణాటకలో ఓ వైద్యుడు ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా 15 కాస్ట్‌లీ కార్లను కాల్చి బూడిద చేశాడు. గత మూడు వారాల్లో సదరు డాక్టర్ గుర్బర్గా, బెల్గాం ప్రాంతాల్లోని పలువురికి చెందిన 15 కార్లు తగులబెట్టాడు. అయితే బాధితులు తమ కార్లను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు నిప్పంటించారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కార్లు తగులబెట్టిన దుండగుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో ఈ నెల 17న విశ్వేశ్వరయ్య నగర్‌లో ఓ వ్యక్తి కారును నిప్పంటించేందుకు యత్నిస్తుండగా అక్కడే ఉన్న ఒకరు అది గమనించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటికే నిందితుడి వేటలో ఉన్న పోలీసులు వెంటనే అక్కడికి చేరుకొని సదరు వ్యక్తిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించి విచారించగా… నిందితుడిని డాక్టర్ అమిత్ గైక్వాడ్‌గా తెలిసింది. అంతేగాక గత మూడు వారాల్లో 15 కార్లను తానే నిప్పంటించినట్లు అంగీకరించాడు. దాంతో గైక్వాడ్ ఇంటి నుంచి భారీ మొత్తంలో పెట్రోల్, డీజిల్‌లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

15 Cars Were Set On Fire In 3 Weeks By A Doctor.

Comments

comments