Home తాజా వార్తలు పొగమంచుతో రోడ్డు ప్రమాదం: 15 మందికి గాయాలు

పొగమంచుతో రోడ్డు ప్రమాదం: 15 మందికి గాయాలు

 

పాట్నా: బీహార్ రాష్ట్రం ముజఫర్ పూర్ నగరంలో 28వ జాతీయ రహదారిపై శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. దట్టమైన పొగ మంచు కప్పుకోవడంతో పలు వాహనాలు ఒకదానితో ఒకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఒకరు దుర్మరణం చెందగా 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానిక ఆస్పత్రికి తరలించారు. పొగ మంచు అధికంగా ఉండటంతో ఎదురుగా ఉన్న వాహనాలు కనిపించకపోయేసరికి ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని పోలీసులు వెల్లడించారు. చలికాలంలో తెల్లవారుజామున ప్రయాణాలు మానుకోవాలని వాహనాదారులకు పోలీసులు సూచిస్తున్నారు.  చలికాలంలో పొగమంచు కారణంగానే రోడ్డు ప్రమాదాలు అధికంగా జరుగుతున్నాయని తెలిపారు. గాయపడిన వారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం.

 

15 Injured in Vehicle Pileup on National Highway 28