Search
Sunday 18 November 2018
  • :
  • :
Latest News

యాదాద్రి జిల్లాలో ఘోర ప్రమాదం…

15 Killed after Tractor rollovers in Nalgonda District

యాదాద్రి భువనగిరి: జిల్లాలోని వలిగొండ మండలం వేములకొండ శివారు లక్ష్మాపురం వద్ద ఆదివారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో వెళ్తున ట్రాక్టర్ ప్రమాదవశాత్తు అదుపుతప్పి మూసీ కాలువలో బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 15 మంది వరకు మృతి చెందారు. మృతదేహాలను వెలికితీసి పోస్టుమార్టం కోసం రామన్నపేట ఏరియా ఆస్పత్రికి తరలించారు.  మృతులంతా వలిగొండ మండలం నందనం గ్రామానికి చెందిన వారుగా గుర్తించారు. ప్రమాదం జరిగిన సమయంలో ట్రాక్టర్ లో మొత్తం 30 మంది కూలీలు ప్రయాణిస్తున్నారు. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. ఉపాధి హామీ పనుల కోసం ట్రాక్టర్ లో వెళ్తుండగా ప్రమాదం జరిగిందని తెలుస్తోంది.

Comments

comments