Home అంతర్జాతీయ వార్తలు చైనాలో ట్రక్కు బీభత్సం!

చైనాలో ట్రక్కు బీభత్సం!

Vehicle pile-up on Chinese highway

బీజింగ్: చైనాలో ఓ ట్రక్కు బీభత్సం సృష్టించింది. వేగంగా వచ్చిన ట్రక్కు అదుపుతప్పి టోల్‌గేట్‌ ముందు ఆగి ఉన్న 31 కార్లపైకి దూసుకెళ్లింది. ఈ ఘోర ప్రమాద ఘటనలో 15 మంది అక్కడికక్కడే మృతిచెందారు. మరో 44 మంది తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా, క్షతగాత్రుల్లో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీంతో మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గన్సూ ప్రావిన్స్‌లోని లన్షూ-హైకౌ హైవేపై శనివారం ఈ ప్రమాదం జరిగింది. ఇక చైనాలో ఇటీవలే బస్సు అదుపుతప్పి లోయలో పడడంతో 13 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనను మరువకముందే తాజాగా ట్రక్కు ప్రమాదం చోటుచేసుకోవడం గమనార్హం.

15 killed in 31-vehicle pile-up on Chinese highway

Telangana Breaking News