Home జనగామ కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి

15 Sheep Were Killed in Dogs Attack

జనగామ : గొర్రెల మందపై కుక్కలు దాడి చేశాయి. ఈ ఘటన యెల్లముల గ్రామంలో బుధవారం చోటు చేసుకుంది. కుక్కల దాడిలో 15 గొర్రెలు మృతి చెందినట్టు గొర్రెల యజమాని చంద్రయ్య తెలిపారు. కుక్కల దాడితో తీవ్రంగా నష్టపోయిన తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని వేడుకున్నారు.
అదేవిధంగా రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం దండుమైలారం అటవీ ప్రాంతంలో చిరుత పులి గొర్రెలపై దాడి చేసింది చిరుత పులి దాడిలో రెండు గొర్రెలు మృతి చెందినట్టు గొర్రెల యజమాని నర్సింహ తెలిపారు. తనను ఆదుకోవాలని ఆయన ప్రభుత్వాన్ని కోరుతున్నారు.

15 Sheep Were Killed in Dogs Attack