Search
Wednesday 21 November 2018
  • :
  • :

15 మంది తెలంగాణ టూరిస్టులపై హత్య కేసు!

Murder

పనాజీ: గోవాలో 15 మంది తెలంగాణ టూరిస్టులపై మర్డర్ కేసు నమోదైంది. కొత్త సంవత్సర వేడుకల కోసం గోవా వెళ్లిన వారు అనూహ్యంగా మర్డర్ కేసులో చిక్కుకోవడం గమనార్హం. జనవరి 1న రాత్రి కలాంగుటేలోని ఓ గెస్ట్ హౌజ్‌లో చిన్న విషయమై సిబ్బందితో వాగ్వాదం జరిగింది. దీంతో గెస్ట్ హౌజ్ సిబ్బందిపై టూరిస్టులు చేయిచేసుకున్నారు. గొడవలో గాయపడిన నలుగురు సిబ్బందిని గోవా మెడికల్ హాస్పిటల్‌కు తరలించారు. అయితే, వీరిలో తీవ్రంగా గాయపడిన జయేశ్ భండారి అనే వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. గొడవ జరిగిన రోజే తెలంగాణ టూరిస్టులపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు కాగా, బాధితుడి మృతితో వారిపై మర్డర్ కేసు నమోదు చేశారు. అనంతరం వారిని అరెస్ట్ చేసి కొల్వాలే సెంట్రల్ జైలుకు తరలించారు.

15 Telangana Tourists Face Murder Case In Goa.

Comments

comments