Home రాష్ట్ర వార్తలు 150 వార్డులు

150 వార్డులు

జిహెచ్‌ఎంసి పునర్విభజన
ముసాయిదా విడుదల
www.ghmc.gov.in చూడండి

GHMCసిటీబ్యూరో: గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ పునర్విభజన ముసాయిదా 150 వార్డుల జాబితాతో విడుదలైందని బుధవారం సాయంత్రం కమిషనర్ సోమేశ్‌కుమార్ వెల్లడించారు. భౌగోళిక సరిహద్దులను నిర్ణ యిస్తూ ఫారం-1 ప్రాథమిక నోటిఫికేషన్ గెజిట్ తదితర వివరాలను జిహెచ్‌ఎంసి వెబ్ సైట్ www.ghmc.gov.in లో అందుబాటు లో పెట్టారు. ప్రభుత్వ జిఒ ఎంఎస్ నెంబర్ 570 తేదీ 06-11-1996 ద్వారా మునిసిప ల్ వ్యవహారాల శాఖ విడుదల చేసిన మార్గదర్శకాలను అనుసరించి, జనగణన డైరెక్టర్ అందించిన జనాభా లెక్కల ప్రకారం ఈ వార్డుల విభజన చేపట్టినట్లు చెప్పారు. ముసాయిదా జాబితాను అన్ని సర్కిల్ కార్యాలయాలు, జోనల్ కార్యాలయాల్లోని నోటీసు బోర్డుల్లో కూడా ప్రదిర్శించనున్నారు. ప్రాథమిక నోటిఫికేషన్‌లో పేర్కొన్న 150 ఎన్నికల వార్డులకు సంబంధించి ఏమైనా సలహాలు, అభ్యంతరాలు ఉంటే వారం రోజులలో తెలపాలని కమిషనర్ ప్రజలను కోరారు. కొన్ని వార్డుల్లో తక్కువ జనాభా, మరికొన్నింటిలో ఎక్కువ జనాభాతో వార్డులు ఉన్నాయని హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. విచారణ చేపట్టిన న్యాయస్థానం వార్డుకు వార్డుకు మధ్య జనాభా వ్వత్యాసం 10 శాతం మించకుండా చూడాలని ఆదేశించింది. న్యాయ స్థానం అదేశాలకు అనుగుణంగా వార్డుల పునర్విభజన చేపట్టాలని జిహెచ్‌ఎంసిని ప్రభుత్వం అదేశించింది. అందులో భాగంగా వార్డుల పునర్విభజనకు శ్రీకారం చుట్టారు.[vimeo url=”video_url” width=”500″ height=”300″]