Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

టాటా మోటార్స్‌లో 1500 మేనేజర్ స్థాయి ఉద్యోగాల కోత

Tata-Motors

ముంబయి: ఐటీ కంపెనీలు ఉద్యోగాల కోతతో ఆందోళన పుట్టిస్తున్న నేపథ్యంలో ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్ కూడా ఇలాంటి వార్తనే వినిపించింది. సంస్థ ఉద్యోగుల్లో మేనేజర్ స్థాయి వారిని తొలగించనున్నట్టు ప్రకటించింది. దాదాపు 1500 మంది ఉద్యోగులను తొలగిం చనున్నట్టు వెల్లడించింది. దేశీయంగా సంస్థ పునర్ని ర్మాణంలో భాగంగాఈ కోతలని తెలిపింది.

మొత్తం మేనేజర్ స్థాయి ఉద్యోగులు 13000 ఉండగా.. వీరిలో 10-12 శాతం మందిని తొలగిస్తున్నట్టు టాటా మోటార్స్ ఎండి, సిఇఒ గుంటెర్ బుచ్చక్ ప్రకటించారు. టాటా మోటార్స్ నాలుగో త్రైమాసిక ఫలితాల సందర్భంగా ఆయన వివరాల ను వెల్లడించారు. అలాగే బ్లూకాలర్ ఉద్యోగుల్లోఎలాంటి తొలగింపులులేవని స్పష్టం చేశారు. పనితీరు, నాయకత్వ లక్షణాల ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నామని కంపెనీ గ్రూప్ సిఎఫ్‌ఒ రామకృష్ణన్ తెలిపారు. వీరిలో కొంతమంది స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పథకాన్ని ఎంచుకున్నారనీ, మరికొంతమందిని ఇతర విభాగాలను బదిలీ చేసినట్టు చెప్పారు.

మంగళవారం వెల్లడించిన 2016-17 జనవరి-మార్చి ఫలితాల్లో టాటా మోటార్స్‌కు చెందిన బ్రిటిష్ అనుబంధ సంస్థ జెఎల్‌ఆర్ మెరుగైన ఫలితాలు సాధించింది. సంస్థ నికర లాభం 18 శాతం పెరిగి 55.7 కోట్ల పౌండ్లను చేరుకుంది. మొత్తం ఆదాయం 10 శాతం పుంజుకుని 726.8 కోట్ల పౌండ్లకు చేరింది. టాటా మోటార్స్ నికర లాభం కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన 17 శాతం క్షీణించి రూ.4296 కోట్లను, మొత్తం ఆదాయం 3 శాతం తగ్గి రూ. 78,747 కోట్లను తాకింది. బాంబే స్టాక్ ఎక్సేంజ్‌పై టాటా మోటార్స్ షేరు విలువ భారీగా 4.44 శాతం పెరిగి రూ.470.50కి చేరుకుంది.

Comments

comments