Search
Thursday 20 September 2018
  • :
  • :
Latest News

నీరుగార్చుతున్న టిఆర్‌ఎస్ పాలన

 1500 people sacrifices for state support

మన తెలంగాణ/నర్సాపూర్ : ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 1500 మంది ప్రాణత్యాగం చేస్తే, అమరుల త్యాగాలను నీరుగార్చుతున్న టిఆర్‌ఎస్‌ను గద్దె దించాలని మాజీ మంత్రి, మెదక్ జిల్లా డిసిసి అధ్యక్షురాలు సునీతారెడ్డి అన్నారు. తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా శనివారం నర్సాపూర్‌లోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద జెండావిష్కరించి, అనంతరం  సోనియగాంధీ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ఎందరో ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధిస్తే టిఆర్‌ఎస్ ప్రభుత్వం మాత్రం అమరుల త్యాగాలను నీరుగార్చుతూ సామాజిక తెలంగాణ అంటూ ముఖ్యమంత్రి కుటుంబ పాలన కొనసాగిస్తున్నారని, అమరుల త్యాగాలను నీరుగార్చుతున్న టిఆర్‌ఎస్‌ను గద్దెదించి తెలంగాణ ప్రజల అభ్యున్నతి కోసం తెలంగాణ రాష్ట్ర ప్రజల ఆకాంక్షను నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి బంగారు తెలంగాణ సాధనకు పాటుపడాలని ఆమె పిలుపునిచ్చారు. దళితుడే ముఖ్యమంత్రి చేస్తామని, నిరుద్యోగులకు లక్ష ఉద్యోగాలు, దళితులకు మూడెకరాల భూమి, నీళ్లు, నిధులు, నియామకాల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చాక ఇచ్చిన హమీలను మరిచిపోయి కుటుంబపాలన చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో కెజీ టు పిజి విద్య అంటూ రాష్ట్రంలో ఇప్పటికే 4 వేల పాఠశాలలను మూసివేసిన ఘనత టిఆర్‌ఎస్ ప్రభుత్వానికే చెల్లిందన్నారు. సామాజిక న్యాయం కోసం అడిగే గొంతులను తెలంగాణ ప్రభుత్వం నొక్కేస్తుందని, బంగారు తెలంగాణ పేరుతో రెండు లక్షల 20 వేల కోట్లు అప్పు చేసి, ప్రతి మనిషిపై రూ.76వేల అప్పును మిగిల్చిన టిఆర్‌ఎస్ పాలనను ప్రజలు గమనిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను గుర్తించిన సోనియాగాంధీ, ప్రతి పక్షాలను కాదని ఆనాడు తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిందని, కాంగ్రెస్ పాలనలోనే సుపరిపాలన ఉంటుందన్నారు. రానున్న రోజుల్లో కాంగ్రెస్‌దే విజయమని ఈ సందర్భంగా సునితారెడ్డి ధీమా వ్యక్తం చేశారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు మల్లేశం, శ్రీనివాస్‌గుప్తా, సత్యంగౌడ్, అంజనేయులుగౌడ్, శ్రీనివాస్ రెడ్డి, సూరారం నర్సింలు ఉన్నారు.

Comments

comments