Search
Monday 19 November 2018
  • :
  • :
Latest News

151కు చేరిన వరద మృతులు

Srilanka-Floods

కొలంబో/న్యూఢిల్లీ : శ్రీలంక భారీ వరదలకు అల్లాడుతోంది. 2003 తర్వాత ఇంత భారీ స్థాయిలో వరదలు రావడం ఇదే ప్రధమం. వరదల మృతుల సంఖ్య ఆదివారం నాటికి 146కు చేరింది. వరద నీరు తగ్గు ముఖం పట్టాక, వాతావరణం కాస్త కుదుట పడ్డాక భద్రతా దళాలు, సహాయక సిబ్బంది సహాయక చర్యలను, గాలింపు చర్యలను ముమ్మరం చేశారు. 15 జిల్లాల్లో 1,14,124 కుటుంబాలకు చెందిన 4,42,299 మంది వరదలకు బాధితులయ్యారని విపత్తు నిర్వహణ కేంద్రం ఆదివా రం తెలిపింది. ఇప్పటి వరకు 146 మంది చనిపోయారని, 112 మంది గల్లంతయ్యారని, 24,603 కుటుంబాలకు చెందిన 1,01,638 మంది ని 319 సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు ఆ కేంద్రం తెలిపింది. భారీ వానలు తగ్గినప్పటికీ నైరుతి భాగంలో మే 29 తర్వాత తుంపర్లు మళ్లీ భారీ వర్షాలుగా దారితీయ వచ్చని అక్కడి వాతావరణ శాఖ తెలి పింది. వాతావరణ పరిస్థితిపై మత్య కారులను అప్రమత్తం చేశారు. శ్రీలంక త్రివిధ దళాలకు చెందిన 1000 మంది సైనికులను సహాయక కార్యక్రమ్రంలో నిమగ్నం చేశారు. సహాయపడాల్సిందిగా శ్రీలంక విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ గాలింపు, సహాయక సలహా గ్రూపు(ఐఎన్‌ఎస్‌ఎఆర్‌ఎజి) కు, ఇరుగుపొరుగు దేశాలకు విజ్ఞప్తి చేసింది. అందరికంటే ముందుగా భారత్ ప్రతి స్పందించింది. ఆహారం, మందులు, నీరు తదితర అత్యవసర వస్తువులను, నావికా పదవలను శ్రీలంక సహాయానికి పంపింది. ఐఎన్‌ఎస్ కిర్చ్‌ను సాయం కోసం కొలంబోకు భారత్ మళ్లించింది.

Comments

comments