హిమాచల్‌ప్రదేశ్ : హిమాచల్‌ప్రదేశ్‌లోని సిమ్లాలో వారం రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాల కారణంగా ఇప్పటివరకు 16 మంది చనిపోయారు. సిమ్లాలో 117 ఏళ్ల తరువాత రికార్డు స్థాయిలో వర్షాలు పడుతున్నాయని అధికారులు తెలిపారు. వర్షాల కారణంగా జనజీవనం అస్తవ్యస్తమైంది. కొండచరియలు విరిగిపడ్డాయి. వేలాది ఇళ్లు నేలమట్టమయ్యాయి. వందలాది మంది నిరాశ్రయులయ్యారు. రాష్ట్ర వ్యాప్తంగా సహాయక చర్యలు చేపట్టారు. బాధిత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు.