Search
Wednesday 21 November 2018
  • :
  • :
Latest News

త్వరలో 16వేల టీచర్ పోస్టులు భర్తీ

DCM-KADIYAM

వరంగల్ : త్వరలోనే 16వేల టీచర్ పోస్టులను భర్తీ చేస్తామని తెలంగాణ ఉపముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. తెలంగాణలో 525 గురుకుల పాఠశాలలను ప్రారంభించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానికే దక్కుతుందని ఆయన చెప్పారు. మూడేళ్ల కాలంలో ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్ పెరిగిందన్నారు. ప్రైవేటు సూళ్లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని చెప్పారు. ఈ క్రమంలోనే విద్యార్థులు ప్రైవేటు పాఠశాలలను కాదని ప్రభుత్వ పాఠశాలల్లో చేరుతున్నారని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఉపాధ్యాయులు కూడా చిత్తశుద్ధితో బోధన చేయాలని ఆయన సూచించారు. మంగళవారం హన్మకొండ అంబేద్కర్ భవన్ లో జరిగిన ఉపాధ్యాయ దినోత్సవంలో కడియం శ్రీహరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు

16 thousand teacher posts are replaced Soonly

Comments

comments