Search
Wednesday 14 November 2018
  • :
  • :

కణితి తొలగింపు… బాలుడికి కంటిచూపు..

brain-image-done-in-photo-sగుర్గావ్ : వైద్యులు అరుదైన శస్త్రచికిత్స చేసి 16 ఏళ్ల బాలుడికి పోయిన కంటి చూపును తిరిగి ప్రసాదించారు. అతడు కంటి చూపు కోల్పోవడానికి కారణమైన మెదడులోని కణితిని గుర్గావ్ వైద్యులు విజయవంతంగా తొలగించారు. చూపు పోయిందనుకున్న బాలుడుకి తిరిగి చూపు ప్రసాదించి అతడి కళ్లలో వెలుగులు నింపారు. బిహార్‌కు చెందిన ఆశిష్ రంజన్ గత ఏడాది డిసెంబర్‌లో తొలుత కుడి కన్ను మసకగా కనిపిస్తోందని ఆస్పత్రికి వెళ్లాడు. క్రమంగా చూపు తగ్గిపోతూ వచ్చి చివరికి పూర్తిగా కనిపించకుండాపోయింది. ఆ తర్వాత ఎడమ కన్ను కూడా చూపు కోల్పోయింది. దీంతో వైద్యులు అతడి కంటి చూపు పోవడానికి కారణం గురించి పరిశీలించగా మెదడులో కణితి ఉందని గుర్తించారు. దీంతో ఫిబ్రవరి 13న ఆపరేషన్ చేసి వైద్యులు మెదడులోని కణితిని తొలగించారు. కళ్లకు సంబంధించిన నరంలోని కణితి పెరగడం వల్ల అతడు చూపు కోల్పోయాడని, నాలుగు గంటల పాటు ఆపరేషన్ చేసి విజయవంతంగా కణితి తొలగించినట్లు వైద్యులు తెలిపారు.కంటి చూపు తిరిగి తెప్పించడం చాలా అరుదైన విజయం అని వైద్యులు ఆనందం వ్యక్తం చేశారు.

Comments

comments