Search
Sunday 23 September 2018
  • :
  • :

కారులో యువతిపై గ్యాంగ్ రేప్..!

16-year-old girl allegedly gang-raped in moving in Greater Noida

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీ పరిధిలోని గ్రేటర్ నోయిడాలో మరో దారుణ ఘటన చోటుచేసుకుంది. కదులుతున్న కారులో 16 ఏళ్ల యువతిపై ముగ్గురు సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. నిందితుల్లో ఒకరు బాధితురాలి బంధువు అని తెలుస్తోంది. 12వ తరగతి చదువుతున్న యువతి స్కూల్ బస్సు మిస్ అవ్వడంతో కాలినడకన ఇంటికి తిరిగి వస్తోంది. ఆ సమయంలో కారులో వచ్చిన ముగ్గురు యువకులు ఆమెను ఇంటి వద్ద దించుతామని నమ్మబలికి ఎక్కించుకున్నారు. అనంతరం యువతికి మత్తు పానీయం తాగించారు. అమ్మాయి మత్తులోకి జారుకోగానే ఒకరి తరువాత ఒకరు కదులుతున్న కారులోనే అఘాయిత్యానికి పాల్పడ్డారు. అయితే రాత్రి అయినా కూతురు ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు రాత్రి రెండు గంటల సమయంలో నాలెడ్జ్ పార్కు సమీపంలో యువతిని గుర్తించారు. ఈ ఘటన ఏప్రిల్ 18న జరగగా ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ముగ్గురు నిందితులు కూడా పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Comments

comments