Home అంతర్జాతీయ వార్తలు కారు బాంబు పేలి 17మంది మృతి

కారు బాంబు పేలి 17మంది మృతి

CARBOMBబాగ్దాద్ : ఇరాక్ రాజధాని బాగ్దాద్‌లో శనివారం కారు బాంబు పేలింది. నగరంలోని పవిత్ర కదిమియా మసీదుకు షియా ముస్లింలు కాలినడకన వెళుతుండగా ఈ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో 17 మంది పౌరులు చనిపోయారు. మరో 35 మంది గాయపడ్డారు. ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులే ఈ పేలుడుకు పాల్పడి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.