Home అంతర్జాతీయ వార్తలు పడవ మునక, 17 మంది మృతి

పడవ మునక, 17 మంది మృతి

Boat-Accident-in-America

బ్రాన్సన్ : అమెరికాలో ఓ పడవ మునిగిపోయింది. మిస్సోరీ సరస్సులో పర్యాటకులతో వెళ్తున్న ఓ పడవ మునకకు గురికావడంతో 17 మంది మృత్యువాతపడ్డారు. మృతుల్లో చిన్నారులు కూడా స్థానిక షరీఫ్ చెప్పారు. బ్రాన్సన్‌లోని టేబాన్సన్‌లోని రాక్ సరస్సులో ప్రయాణం చేస్తున్న పడవ మునిగిన ఘటనలో మరో ఐదుగురు కూడా గల్లంతయ్యారని, ఇంకో ఏడుగురు ఆసుపత్రి పాలయ్యారని స్టోన్ కౌంటీ షరీఫ్ డౌగ్ రాడర్ పేర్కొన్నారు. పడవ మునకకు ప్రతికూల వాతావరణమే కారణంగా కనిపిస్తోందన్నారు. ఘటన అనంతరం ఆఫ్ డ్యూటీలో ఉన్న పడవ కంపెనీకి చెందిన అధికారులు సహాయక చర్యల్లో పాల్గొన్నారన్నారు. ప్రమాదం జరిగిన వెంటనే నలుగురు పెద్దలు, ముగ్గురు చిన్నారులు ఆసుపత్రికి వచ్చినట్లు బ్రాన్సన్‌లోని కాక్స్ మెడికల్‌సెంటర్ మహిళా ప్రతినిధి వెల్లడించారు. ఇద్దరు పెద్దల పరిస్థితి విషమంగా ఉందని, స్వల్పగాయాలైన వారికి చికిత్స చేస్తున్నట్లు ఆమె చెప్పారు. దర్యాప్తు అధికారులు శుక్రవారం ఉదయం ఘటనాస్థలికి చేరుకున్నట్లు జాతీయ రవాణా రక్షణ బోర్డు ట్విట్టర్‌లో వెల్లడించింది.