Home జాతీయ వార్తలు ఎంపిగా మోడీ ప్రమాణం

ఎంపిగా మోడీ ప్రమాణం

Lok Sabhaఢిల్లీ : 17వ లోక్ సభ సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. కొత్త ఎంపిలు ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఎన్ డిఎ పక్ష నేత నరేంద్రమోడీ ఎంపిగా ప్రమాణం చేశారు. ప్రొటెం స్పీకర్ వీరేంద్ర కమార్ మోడీ చేత ఎంపిగా ప్రమాణం చేయించారు. అనంతరం కాంగ్రెస్ నుంచి సురేశ్ కొడికున్నిల్, కేంద్ర రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్, కేంద్ర హోంమంత్రి అమిత్ తదితరులు ప్రమాణం చేశారు. కేంద్ర మంత్రులు, ప్యానెల్ చైర్మన్లు ముందుగా ప్రమాణం చేస్తారు. అనంతరం ఆంగ్ల అక్షర క్రమంలో రాష్ట్రాలవారీగా ఎంపిలు ప్రమాణం చేస్తారు. మంగళవారం కూడా ఎంపిల ప్రమాణ స్వీకార కార్యక్రమం జరగనుంది. జులై 26వరకు లోక్ సభ సమావేశాలు జరుగుతాయి. జులై 5న కేంద్ర బడ్జెట్ ను సభలో ప్రవేశ పెడుతారు. ఈ సమావేశాల్లో త్రిపుల్ తలాక్ తో పాటు పది ఆర్డినెన్స్ లకు చట్టం తేవాలన్న ఆలోచనతో కేంద్రం ఉంది.

17th Lok Sabha Sessions Start On Moday