Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఘోర రోడ్డు ప్రమాదం… 18 మంది మృతి!

18 killed in China coach-truck highway collision

బీజింగ్: సెంట్రల్ చైనాలోని హునన్ ప్రావిస్సులో ఓ ప్యాసింజర్ కోచ్, ట్రక్కు ఒకదానొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో 18 మంది అక్కడికక్కడే చనిపోయారు. మరో 14 మంది వరకు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను వెంటనే సమీపంలోని ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దుర్ఘటన శుక్రవారం సాయంత్రం జరిగినట్టు అక్కడి పోలీసులు తెలిపారు. గత కొన్నిరోజులుగా ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా రోడ్లు చిత్తడిగా మారడంతో ఈ ప్రమాదం జరిగిందని తెలిసింది.

Comments

comments