Home తాజా వార్తలు ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం

ఉత్తరప్రదేశ్‌లో రైలు ప్రమాదం

Train-Accident

లక్నోః ఉత్తరప్రదేశ్‌లో కుల్‌పహాడ్ దగ్గర మహాకోశల్ ఎక్స్‌ప్రెస్ రైలు పట్టాలు తప్పింది. ఎనిమిది బోగీలు పట్టాలు తప్పడంతో 18 మంది గాయపడ్డారు. గాయపడినవారిలో ఐదుగురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. రైలు జబల్‌పూర్ (మధ్యప్రదేశ్) నుంచి హజరత్ నిజాముద్దీన్ కు (ఢిల్లీకి ) వెళ్తున్నప్పుడు ఈ ఘటన జరిగింది. రైల్వే సిబ్బంది, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. .