Home అంతర్జాతీయ వార్తలు రష్యాలో కూలిన విమానం: 18 మంది మృతి

రష్యాలో కూలిన విమానం: 18 మంది మృతి

Aeroplane

 

మాస్కో: రష్యా లోని సైబిరియా లో శనివారం ఉదయం విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో 18 మంది దుర్మరణం చెందారు. ఇగర్కా ప్రాంతం నుంచి 182 కిలో మీటర్ల దూరంలో 10.20 గంటలకు ఎంఐ -8 అనే  విమానం కూలిందని విమానయాన అధికారులు వెల్లడించారు.  మృతి చెందిన వారిలో 15 మంది పయాణికులుండగా ముగ్గురు పైలట్లు ఉన్నట్టు సమాచారం. విమానం టేకాఫ్ అవుతున్న సమయంలో ఇంజన్ల్ లో ఎటువంటి సాంకేతిక లోపం లేదని కానీ కొద్ది దూరం ప్రయాణించక విమానం కూలిందని అధికారులు తెలిపారు.