Search
Saturday 17 November 2018
  • :
  • :

చైనాలో భారీ వర్షాలు : 180 మంది మృతి

China-Rainబీజింగ్: చైనాలో కుండపోత వర్షాల కారణంగా యాంగ్‌ట్జె నదికి వచ్చిన వరదల్లో దాదాపు 180 మంది మృతి చెందారు. మొత్తం ఏడు ప్రావిన్సుల్లో 10 సెంటిమీటర్ల నుంచి 50 సెంటిమీటర్ల వరకు వర్షపాతం కురిసింది. దాదాపు 1600 కిలోమీటర్ల పరిధిలో తీవ్రమైన గాలులు వీచాయి. ఈ వర్షాలకు దాదాపు 33 మిలియన్ల మంది ప్రజలు అవస్థలు పడగా.. 45 మంది ఆచూకీ గల్లంతైంది. వర్షాల దెబ్బకు రైల్వేలైన్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. చాలా చోట్ల రహదారులను మూసివేశారు. జుయిఝూ ప్రావిన్స్‌లో మట్టిపెళ్లలు విరిగిపడి 23 మంది మృతి చెందారు. హుబాయి ప్రావిన్స్‌లో వుహాన్ పట్టణంలో గోడకూలి మరో 8 మంది మృతి చెందారు. పశ్చిమ, దక్షిణ చైనాల్లో బుధవారం వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ ప్రకటించింది.

Comments

comments