Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

మహారాష్ట్రలో ‘ఛాయ్ కుంభకోణం’?

tea-image

ముంబయి: మంత్రాలయలో దాదాపు 3 లక్షల ఎలుకల చంపివేత వివాదం సద్దుమణిగిన కొన్ని రోజులకే ఇప్పుడు తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయంలో పెద్ద ఎత్తున ‘ఛాయ్ కుంభకోణం’ వివాదం రాజుకుంది. సిఎం కార్యాలయంలో రోజుకు 18,500 కప్పుల ఛాయ్ ఖర్చు కావడంపై మహారాష్ట్ర కాంగ్రెస్ బుధవారం దుమ్మెతిపోసింది. దీనికి సంబంధించిన సమాచార హక్కు చట్టం పత్రాన్ని ముంబయి కాంగ్రెస్ చీఫ్ సంజయ్ నిరుపం  ట్విట్టర్‌లో పెట్టారు. మూడేళ్ల కాలంలో సిఎం కార్యాలయంలో టీ సేవనం అమాంతం పెరిగిపోయిందని ధ్వజమెత్తారు. సమాచారహక్కు చట్టం కింద అందిన సమాచారాన్ని ఉటంకిస్తూ  2015 16లో  సిఎం కార్యాలయం టీ ఖర్చు రూ. 58 లక్షలుకాగా, 2017-18లో అది రూ. 3.4 కోట్లకు పెరిగిందని తెలిపారు. ఇది దాదాపు 577 శాతం పెరుగుదల. అంటే సగటున రోజుకు సిఎం కార్యాలయం లో 18,591 కప్పులు వినియోగించారని పేర్కొన్నారు. ‘మాకు తెలిసినంత వరకు గ్రీన్ టీ, ఎల్లో టీ తెలుసు. కానీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఎలాంటి తీ త్రాగుతున్నారు?’ అని నిరుపమ్ వ్యంగంగా ప్రశ్నించారు. రైతుల వ్యథలపట్ల ఫడ్నవీస్ ప్రభుత్వం పూర్తి వివక్ష ధోరణిని ప్రదర్శిస్తోందని విమర్శించారు. సిఎం కార్యాలయం టీ బిల్లులో అవినీతికి పాల్పడుతుంటే, మరోప్రక్క ప్రధాని ‘చాయ్‌వాలా’ అంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు.

Comments

comments