Search
Monday 12 November 2018
  • :
  • :
Latest News

ఎపికి 19 డయాలిసిస్ యూనిట్లు : నడ్డా

19 Dialysis Units for AP : Union Minister Nadda

అమరావతి : ఎపికి 19 డయాలిసిస్ యూనిట్లను మంజూరు చేసినట్టు కేంద్రమంత్రి జెపి నడ్డా తెలిపారు. కిడ్నీ రోగుల కోసం ప్రధాన మంత్రి డయాలిసిస్ పథకాన్ని అమలు చేస్తున్నామని ఆయన వెల్లడించారు. కిడ్నీ రోగులు అధికంగా ఉన్న శ్రీకాకుళం జిల్లాతో పాటు పలు ప్రాంతాల్లో కిడ్నీ సమస్యలపై అధ్యయనం చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో 55 కోట్ల మందికి ఆరోగ్య బీమా అమలు చేస్తున్నామన్నారు. ఇప్పటి వరకు 26రాష్ట్రాలు బీమా కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నాయని ఆయన వెల్లడించారు. ఆరోగ్య భారత్‌ను నిర్మించాలన్న సంకల్పంతో ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని ఆయన పేర్కొన్నారు.

19 Dialysis Units for AP : Union Minister Nadda

Comments

comments