Search
Saturday 17 November 2018
  • :
  • :
Latest News

హెలికాప్టర్ కూలి 19 మంది మృతి

Helicopter-Crashedమాస్కో : సైబీరియా ప్రాంతంలో రష్యాకు చెందిన ఓ హెలికాప్టర్ కూలిపోయింది. క్రస్నోయార్క్ రీజియన్ నుంచి ఉరెంగోయ్ ప్రాంతానికి 22 మంది ప్రయాణికులతో వెళుతున్న ఎం-8 హెలికాప్టర్ ప్రమాదవశాత్తు కుప్పకూలింది. సమాచారం అందుకున్న రెస్కూ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ప్రమాదం నుంచి ముగ్గురు ప్రయాణికులను రక్షించారు. 19 మంది చనిపోయినట్లు అధికారులు తెలిపారు. గాయపడిన వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. సాంకేతిక కారణాలు లేదా వాతావరణ పరిస్థితుల కారణంగానే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని భావిస్తున్నారు. తొలుత హెలికాప్టర్‌ను అత్యవసరంగా ల్యాండ్ చేస్తున్నామని తమకు సమాచారం అందిందని అధికారులు వెల్లడించారు. ఇంతలోనే ఈ దుర్ఘటన జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు.

Comments

comments