Home మహబూబాబాద్ కురవి జిపికి కుట్టుటోపి

కురవి జిపికి కుట్టుటోపి

గ్రామపంచాయతీరూ.19,99,999 లక్షలు స్వాహా
సంతా గుత్తేదారుల ఎగనామ..,
సంత రద్దు చేసినట్లు అధికార ప్రకటన

Mahaboobabad

కురవి : మహబూబాబాద్ జిల్లాలోనే అతి పెద్ద వారాంతపు సంతగా పేరొందిన పశువుల సంతకు గుత్తేదారుల రూ.19,99,999 లక్షలు గ్రామ పంచాయతీకి కిస్తీల ప్రకారంగా చెల్లించకుండా ఎగొట్టారు. వివరాలు ఇలాఉన్నాయి పంచాయతీ రాజ్‌శాఖ ఉన్నతాధి కారుల ఉత్త ర్వూల ప్రకారం స్థానిక గ్రామ పంచా యతీ సర్పంచ్ గుగు లోత్ పూర్ణచంద్యా నాయక్ అధ్యక్షతన జిపి కార్యదర్శి మున్వర్‌భేగ్ 2016-17 సంవత్సరం గాను తైబజార్, పశువుల సంతా వేళం పాట ప్రకటించారు. దీంతో కురవి గ్రామానికి చెందిన సంగెం వీరభద్రం తైబజార్ సుమరు రూ.6 లక్షలకు పాడి కైవసం చెసుకు న్నారు.

అలాగే మాదవపురం గ్రామానికి చెందిన భూక్య రామునాయక్ రూ.59,99,999 లక్షలకు పశువుల సంతను కైవసం చేసుకున్నారు. అయితే జిపి అగ్రిమెంట్ ప్రకారంగా కిస్తీల ద్వారా 2016 డిశంబర్ నెలాకరీ లోపు గుత్తేదారులు పూర్తిగా డబ్బులు చెల్లించాలి. గుత్తేదారులు అగ్రిమెంట్ ప్రకారం డబ్బులు చెల్లించక జాప్యం చేస్తూ యదావిదిగా సంతను కొనాసాగిస్తూ కేంద్ర ప్రభుత్వం పెద్ద నోట్ల ప్రభావం వల్లా సంతాలో నష్టం వచ్చిందని, కిస్తీల ద్వారా జిపికి చెల్లించాల్సిన రూ.19,99,999 డబ్బులు చెల్లించలేమని హైకోర్టులో పిటీషన్ వేశారు. దీంతో గ్రామ పంచాయతీ ఉన్నతాధికారులు డబ్బులు చెలించాలని, లేనియడల సంతా రద్దు పరుస్తామని గుత్తేదారులకు నోటీస్‌లు జారిచేశారు.

దీంతో తైబజార్ గుత్తేదారి డబ్బులు చెల్లించారు. కాని పశువుల సంతా గుత్తేదారి డబ్బులు చెల్లించక పోగా అధికార పార్టీ ముఖ్య ప్రతినిధితో గ్రామ పంచాయతీ జిల్లా స్థాయి అధికారులకు వత్తిడి చేపించాడు. అయిన గుత్తేదారునికి ఫలితం దక్కలేదు. జిల్లా అధికారి గ్రామ పంచాయతీ సిబ్బంది ద్వారా పశువుల సంతా జరిపించాలని కురవి జిపికి ఉత్తర్వూలు జారిచేసినట్లు సమాచారం. అలాగే సంతలో గుత్తేదారుల వల్లా ఏలాంటి పరినామాలకు తావులేకుండా పోలీస్‌లు సహకరించాలని కోరినట్లు తెలిసింది. 2014-15 సంవత్సరంలో కూడా స్థానికుడు పశువుల సంతా పట్టి రూ.6,47,330 లక్షలు చెల్లించకుండా అప్పటి అధికారులతో కుమ్మక్కై డబ్బులు చెల్లించకుండా ఎగనామ పెట్టడంతో అట్టి విషయం దృష్టిలో పెట్టుకున్న అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు ఈ దఫా గట్టినిర్నయం తీసుకుని గ్రామ పంచాయతీ కమీషనర్, జిల్లా అధికారి దృష్టికి తీసుకువెళ్ళారు. దీంతో అధికార పార్టీ ప్రజా ప్రతినిధుల ఫైరవీలు లెక్కజేయకుండా పశువుల గుత్తేదారులు కిస్తీలు చెల్లించనందున వార్డు సభ్యుల తీర్మాణం మెరకు పశువుల సంతా రద్దు చేయుటకు కురవి జిపికి ఉత్తర్వూలు జారీ చేశారు.

కురవి పశువుల సంతా రద్దు : జీపి కార్యదర్శి మున్వర్‌బేగ్

కురవి పశువుల సంతపై గత నెల నుండి జరుగుతున్న ముసలంపై మన తెలంగాణ వివరణ కోరగా జిపి శాఖ, పై అధికారుల ఆదేశాల మెరకు గురువారం వార్డు సభ్యుల సమావేశంలో పశువుల సంతా రద్దు చేసినట్లు కురవి గ్రామ పంచాయతీ కార్యధర్శి ముక్వర్‌భేగ్ తెలిపారు. గుత్తేదారులు జీపికి అగ్రిమెంట్ ప్రకారంగా రూ.19,99,999లక్షలు చెల్లించనందున పశువుల సంతా గుత్తేదారుల నుండి రద్దు చేసి తదుపరి వచ్చే సోమవారం నుండి జీపి సిబ్బందితో సంతా కొనసాగించుటకు సర్పంచ్‌తో సహ అధిక వార్డు సభ్యులు ఏకగ్రీవంగా తీర్మాణించినట్లు ముక్వర్‌భేగ్ తెలిపారు. తదుపరి పై అధికారుల ఆదేశాల మెరకు సిబ్బందితో పశువుల సంతా కొనసాగుతుందని తెలిపారు.