Home అంతర్జాతీయ వార్తలు కెమికల్ ప్లాంట్‌లో పేలుడు : 19 మంది మృతి

కెమికల్ ప్లాంట్‌లో పేలుడు : 19 మంది మృతి

fire-accident

సిచువాన్: చైనాలోని సిచువాన్ పారిశ్రామికవాడలో శుక్రవారం పేలుడు సంభవించింది. ఈ సంఘటనలో 19 మంది మృత్యువాత పడ్డారు. మరో 12 మందికి తీవ్ర గాయాలయ్యాయి. హిబిన్ హింగ్డా టెక్నాలజీకి సంబంధించిన కెమికల్ ప్లాంట్‌లో ఈ పేలుడు జరిగింది. పేలుడు జరిగిన వెంటనే భారీ మంటలు వ్యాపించి, దట్టమైన పొగతో నిండిపోయింది. సిబ్బంది సమాచారంతో హూటాహుటినా ఘటనాస్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపుచేస్తున్నారు. పేలుడుకు కారణాలు ఇంకా తెలియాల్సిఉందని అధికారులు వెల్లడించారు.