Home రాష్ట్ర వార్తలు ఎస్‌ఐ పోస్టులకు 19వేల దరఖాస్తులు

ఎస్‌ఐ పోస్టులకు 19వేల దరఖాస్తులు

కానిస్టేబుల్ పోస్టులతో పోలిస్తే తగ్గిన డిమాండ్

police-nzbమన తెలంగాణ/ హైదరాబాద్ : తెలంగాణ పోలీసు శాఖలో వివిధ విభాగాలలో గల 539 ఎస్‌ఐ పోస్టులకు గడచిన వారం రోజుల్లో 19545 మంది దరఖాస్తు చేసు కున్నారు. అయితే కానిస్టేబుల్ పోస్టులకు వెల్లువెత్తిన దరఖాస్తులతో పోలిస్తే ఎస్‌ఐ ఖాళీలకు వస్తున్న దరఖా స్తులు తక్కువగా వుండడం గమనార్హం. మొత్తం పోస్టుల్లో సివిల్, సాయుధ బలగం, ప్రత్యేక సాయుధ బలగం, స్పెషల్ పోలీసు, అగ్నిమాపక విభాగాలలో 510 పోస్టు లు పోలీ సు రవాణా విభాగంలో 29 పోస్టులున్నాయి. ఇందులో సివిల్, సాయుధ బలగం, ప్రత్యేక సాయుధ బలగం, స్పెషల్ పోలీసు, అగ్నిమాపక విభాగాలలోని 510 పోస్టులకు బుధవారం వరకు 17983 దరఖా స్తులు వచ్చాయి.పోలీసు రవాణావిభాగంలోని 29 పోస్టు లకు 326 దరఖాస్తులు అందాయి. సివిల్, సాయుధ బలగం తదితర విభాగాల్లోని పోస్టులకు అందిన దరఖా స్తుల్లో బిఎ చదివిన వారు 2081, బికాం చదివిన వారు 3024, బి ఫార్మసీ చదివిన వారు 307 బిఎస్‌సి చదివిన వారు 3370, బిఎస్‌సి (వ్యవసాయం) చదివిన వారు 15, బిటెక్ చదివిన వారు 4832, బిబిఎం చదివిన వారు 25, బిసిఎ చదివిన వారు 19, ఇంటర్ పూర్తి చేసిన వారు 865, ఎంఎ చదివిన వారు 298, ఎంకాం చది విన వారు 165, ఎం ఫార్మసీ చదివిన వారు 122, ఎం ఫిల్ చదివిన వారు ముగ్గురు, ఎంఎస్‌సి చదివిన వారు 638, ఎంటెక్ చదివినవారు 413, ఎంబిఎ చదివిన వారు 1269, ఎంసిఎ చదివిన వారు 287, ఇతర డిగ్రీ లున్న వారు 250 మంది వున్నారు. పోలీసు రవాణా విభాగం పోస్టులకు దరఖాస్తు చేసిన 326 మందిలో ఇం జినీరింగ్‌లోని పలు విభాగాల్లో పట్టాలు అందుకున్న వారు న్నారు. కాగా 9281 కానిస్టేబుల్ పోస్టులకు ఐదు లక్షల 36 వేలకు పైగా వచ్చిన దరఖాస్తులతో పోలిస్తే ఎస్‌ఐ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకుంటున్న నిరు ద్యోగుల సంఖ్య తక్కువగా వుండడం విశేషం. ఎస్‌ఐ పోస్టులకు ఈ నెల పదవ తేదీన దరఖాస్తుల స్వీకరణ మొదలు కాగా మార్చి మూడవ తేదీన ముగియనుంది. వారం రోజుల్లో వచ్చిన దరఖాస్తు లు 19545గా వుంటే మిగిలిన మరో రెండు వారాల్లో మరో 50 వేల దరఖా స్తులు వచ్చే వీలుందని రిక్రూట్‌మెంట్ బోర్డు అధికారులు భావిస్తున్నారు.
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ పోటీలో
టి. పోలీసులకు మూడు అవార్డులు
పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా నిర్వహించిన జాతీయ స్థాయి పోటీలో తెలంగాణ రాష్ట్ర పోలీసు విభా గం మూడు అవార్డులను సాధించింది. బంగారు తెలం గాణ సాధనలో పబ్లిక్ రిలేషన్స్, కమ్యూనికేషన్స్ రోల్‌పై ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లో జరగనున్న జాతీ యస్థాయి సమావేశానికి ముందుగా జరిగిన పోటీలో తెలంగాణ పోలీసు శాఖ మూడు విభాగాల్లో అవార్డులు అందుకుంది. తెలంగాణ స్మార్ట్ పోలీసింగ్ వీడియో ఫిల్మ్ కు మొదటి బహుమతి రాగా, తెలంగాణ పోలీసు వెబ్ సైట్‌కు మూడవ బహుమతి, సురక్ష జర్నల్‌కు స్పెషల్ జ్యూరీ అవార్డు వచ్చింది. పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ నిర్వ హించిన పోటీలో టి. పోలీసులు అవార్డులు సాధించడం పట్ల డిజిపి అనురాగ్‌శర్మ సంతోషం వ్యక్తంచేశారు. అవా ర్డులు సాధించిన వారికి అభినందనలు తెలిపారు.