Home జాతీయ వార్తలు సిబిఎస్‌ఇ టాపర్‌పై గ్యాంగ్ రేప్..!

సిబిఎస్‌ఇ టాపర్‌పై గ్యాంగ్ రేప్..!

19 Year Old CBSE Topper Gang Raped in Haryana
చండీగఢ్: ఎన్ని కఠిన చట్టాలు తీసుకువస్తున్నమహిళలు, యువతులపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు. కామంతో కళ్లుమూసుకుపోయి కొందరు మృగాలు రెచ్చిపోతున్నారు. దీంతో దేశవ్యాప్తంగా రోజు రోజుకూ దారుణాలు పెరుగుతూనే ఉన్నాయి. తాజాగా హర్యానాలో మరో ఘోరాతి ఘోరం జరిగింది. గత సిబిఎస్ఇ బోర్డు పరీక్షలో టాపర్ గా నిలిచి, రాష్ట్రపతి చేత సన్మానం పొందిన 19 ఏళ్ల యువతిని ముగ్గురు కామాంధులు అపహరించి సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు. ఈ దారుణ ఘటన హర్యానాలోని మహేంద్రగఢ్ జిల్లాలో జరిగింది. డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థిని సమీపంలోని కోచింగ్‌కు వెళుతున్న సమయంలో ముగ్గురు వ్యక్తులు ఆమెను కిడ్నాప్ చేసి దగ్గరలోని పొలాల్లోకి తీసుకెళ్లారు. అక్కడ ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అనంతరం స్పృహ కోల్పోయిన బాధితురాలిని సమీపంలోని బస్ స్టాండ్ వద్ద పడేసి వెళ్లిపోయారు. స్పృహ వచ్చిన తర్వాత వేరే వాళ్ల సాయంతో ఇంటికి చేరిన బాధిత యువతి తనపై జరిగిన దారుణాన్ని తల్లిదండ్రులకు చెప్పింది. దాంతో యువతిని తీసుకుని ఆమె తల్లీదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఎఫ్ఐర్ నమోదు చేయడానికి పోలీసులు నిరాకరించడంతో బాధితురాలు కన్నీరుమున్నీరవుతోంది. కాగా, ఘటన జరిగిన ప్రదేశం తమ పోలీస్ స్టేషన్‌ పరిధిలో రాకపోవడంతో జీరో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. దీనిని శుక్రవారం ఉదయం రెగ్యూలర్‌ ఎఫ్‌ఐఆర్‌గా సంబంధిత పోలీస్‌ స్టేషన్‌కు బదిలీ చేశామని పోలీసు ఉన్నతాధికారులు చెప్పారు.

Telangana Breaking News