Search
Wednesday 26 September 2018
  • :
  • :

మనస్థాపంతో యువతి ఆత్మహత్య

చెరువులో తేలియాడుతున్న యువతి మృతదేహం
suicide1గుడిహత్నూర్ : ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలకేంద్రంలోని జవహర్‌నగర్‌కు చెందిన తొడసం రేణుక (18) అనే యువతి మనస్థాపంతో మండలంలోని సీతాగొంది గ్రామ సమీపంలోని చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మృతురాలి అన్నయ్య మరియు స్థానిక పోలీసుల కథనం ప్రకారం తొడసం రేణుక మరియు జవహర్ నగర్‌కు చెందిన అనక తుకారాం గత కొంతకాలంగా ప్రేమించుకుంటున్నారు. గురువారం గ్రామ పెద్దల సమక్షంలో వీరిప్రేమ విషయమై పెద్దలు పంచాయతీ నిర్వహించారు. ఈ పంచాయతీలో తుకారాం తల్లి అనక రుక్మిణీబాయి, చెల్లెలు తుర్పాబాయిలు కలిసి యువతిని చితకబాదారు. దీంతో యువతి తనకు అవమానం జరిగిందని మనస్థాపానికి గురై అదేరోజు ఇంటినుండి వెళ్ళిపొయింది. శనివారం సాయంత్రం సీతాగొంది గ్రామచెరువులో ఓ యువతి మృతదేహం తేలుతుండగా కొందరు స్థానికులు గమనించి పోలీసులకు సమాచారమందించారు. అప్పటికే చీకటి పడడంతో మృతదేహం తీయడానికి వీలుపడలేదు. ఆదివారం ఉదయం విషయం తెలుసుకున్న మృతురాలి అన్న సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహం తన చెల్లెలిదిగా గుర్తించినట్టు పోలీసులు తెలిపారు. యువతి మృతదేహం పూర్తిగా కుళ్ళిపోయి ఉండడంతో నాలుగురోజుల క్రితమే ఆత్మహత్యకు పాల్పడి ఉంటుందని పోలీసులు పేర్కొన్నారు. మృతురాలి తండ్రి నెలరోజుల క్రితమే అనారోగ్యంతో మృతిచెందగా తల్లి చిన్నప్పుడే చనిపోయింది. మృతురాలి అన్నయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ కిరణ్‌కుమార్ తెలిపారు.

Comments

comments