Home తాజా వార్తలు విజువల్ ట్రీట్ ‘2.0’ ట్రైలర్

విజువల్ ట్రీట్ ‘2.0’ ట్రైలర్

2.0-Movie Trailer

సూపర్ స్టార్ రజనీకాంత్, క్రియేటీవ్ డైరెక్టర్ శంక‌ర్ ల కాంబినేషన్ లో అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిన భారీ ప్రాజెక్ట్ ‘2.0’. తాజాగా ఈ మూవీ ట్రైలర్ ను విడుదల చేశారు. ట్రైలర్ లాంచింగ్ వేడుక చెన్నై సత్యం సినిమాస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రజినీ కుటుంబ సమేతంగా హాజరయ్యారు. రజినీ, అక్షయ్ కలిసి ట్రైలర్‌ను లాంచ్ చేశారు. ట్రైలర్‌తో శంకర్ మరోసారి అభిమానులకు విజువల్ ట్రీట్ ఇచ్చారు. ఇప్పటికే విడుదలైన టీజర్ కు విశేష స్పందన లభించగా, తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ ఎన్ని రికార్డులు క్రియేట్ చేస్తోందో చూడాలి. దాదాపు 540 కోట్ల భారీ బ‌డ్జెట్‌తో లైకా సంస్థ‌ ఈ చిత్రాన్ని రూపొందించింది. రజినీ సరసన అమీ జాక్సన్ హీరోయిన్‌గా నటిస్తోంది. అక్షయ్ కుమార్ ప్రతి నాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం 1000 మంది విఎఫ్ఎక్స్ ఆర్టిస్ట్స్ ప‌ని చేయ‌గా, కాన్సెప్ట్ ఆర్టిస్టులు 10, 3డి డిజైన‌ర్స్ 25 మంది, క్రాఫ్ట్స్ మాన్ 500 మంది ప‌ని చేశారు. ఈ సినిమాను నవంబర్‌ 29న ప్రపంచవ్యాప్తంగా భారీగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది.

2.0 Official Trailer Released

Telangana Breaking News