Home తాజా వార్తలు ఢిల్లీ విమానాశ్రయంలో 2.5 కిలోల పసిడి పట్టివేత

ఢిల్లీ విమానాశ్రయంలో 2.5 కిలోల పసిడి పట్టివేత

Delhi-Airport

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలోని ఇందిర గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో బుధవారం భారీ మొత్తంలో బంగారం పట్టుబడింది. సుమారు రూ. 75.65 లక్షల విలువైన బంగారాన్ని ఎయిర్‌పోర్ట్ భద్రతా అధికారులు స్వాధీనం చేసుకున్నారు. సోదాల్లో భాగంగా బ్యాటరీల రూపంలో తీసుకు వచ్చిన 2.5 కిలోల బంగారం పట్టుకున్నారు. డామన్ నుంచి బంగారం అక్రమంగా తీసుకువచ్చిన వ్యక్తిని అధికారులు అరెస్టు చేశారు.

2.5 Kg of gold Seized in Indira Gandhi International Airport.