Search
Tuesday 13 November 2018
  • :
  • :
Latest News

2.59 కోట్ల ఉద్యోగాల సృష్టి

bsns

ట్రావెల్, టూరిజంలో  2.59 కోట్ల ఉద్యోగాల సృష్టి

 2017లో పెరిగిన రెండు రంగాల మార్కెట్
 జిడిపిలో ఈ రంగాల వాటా రూ.14,110 కోట్లు
 కెపిఎంజి, ఫిక్కీ సంయుక్త సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: గత ఏడాదిలో ట్రావెల్, పర్యాటక రంగాలు 2.59 కోట్ల ఉద్యోగాలను సృష్టించాయని, ఈ రెండు రంగాలు జిడిపి(స్థూల దేశీయోత్పత్తి)కి దాదాపు రూ.14,110 కోట్లు అందించాయని కెపిఎంజి, ఫిక్కీలు సంయుక్తంగా నిర్వహించిన సర్వేలో తేలింది. ‘ఎక్స్‌పిడిషన్ 3.0: ట్రావెల్ అండ్ హాస్పిటాలిటీ గాన్ డిజిటల్’ పేరిట ఈ నివేదికను విడుదల చేశాయి. మొబైల్ అప్లికేషన్లు, బిగ్ డేటా, ఎఐ, విఆర్, ఎఆర్‌లు పర్యాటక పరిశ్రమ భవిష్యత్‌ను మార్చివేశాయి. నివేదిక ప్రకారం, అంతర్జాతీయ డిజిటల్ ట్రావెల్ సేల్స్‌లో భారత్‌కు 3.7 శాతం వాటా అంచనా వేయగా, ఆసియా పసిఫిక్(అపాక్) రీజియన్‌లో అతిపెద్ద మార్కెట్ దిశగా అడుగులు వేస్తోంది. భారత్‌లో కెపిఎంజి వద్ద ట్రాన్స్‌పోర్ట్, లీజర్, స్పోర్ట్ హెడ్ జైదీప్ ఘోష్ మాట్లాడుతూ, పర్యాటకంలో డిజిటల్ విప్లవం మొదలైందని, సాంకేతిక పరిజ్ఞానంలో మార్పులు కొత్త ఆవిష్కరణలకు నాంది పలుకుతున్నాయని అన్నారు. కార్పొరేట్, వినియోగదారుల ప్రయాణ సరిహద్దులు ఇప్పటికే కనిపించకుండా పోయాయి. పర్యాటకంలో వేగంగా మార్పులు చోటుచేసుకుంటున్నాయి. డిజిటల్ బిజినెస్ సృష్టితో భవిష్యత్ ప్రయాణం కొత్త ఆకృతిని సంతరించుకుందని ఆయన తెలిపారు. నివేదిక ప్రకారం, స్మార్ట్‌ఫోన్లు, ఇంటర్నెట్ పెరగడం పర్యాటక రంగానికి అత్యంత అనుకూలంగా మారింది. దీంతో పర్యాటకుల సంఖ్య మరింతగా పెరుగుతోంది. గత ఏడాదిలో 34 శాతం మంది యువ పర్యాటకులు ఒక్క రోజు రూ.6 వేలు, అంతకుమించి ఖర్చు చేస్తున్నారు. 22 శాతం మంది 55 ఏళ్లకు పైబడినవారితో పోలిస్తే వీరి సంఖ్య పెరిగింది. విశ్రాంతి పర్యాటకం 95 శాతానికి చేరింది.  దేశంలో అతిపెద్ద ఉద్యోగ సృష్టికర్తలుగా ట్రావెల్, టూరిజం రంగాలు ఉన్నాయని, ప్రత్యక్షంగానే ఈ రంగాలు 2.59 కోట్ల ఉద్యోగాలు అందించాయని కెపిఎంజి, ఫిక్కీ నివేదికలు తెలిపాయి. దేశీయ ఆర్థిక వ్యవస్థలో ట్రావెల్, టూరిజం కీలక రంగాలుగా ఉన్నాయని, విదేశీ పర్యాటకుల తాకిడి ఏడాది ఏడాదికి 15.6 శాతం స్థిరమైన వృద్ధి రేటు నమోదు చేశాయని సర్వేలు తెలిపాయి. ఆన్‌లైన్ ట్రావెల్ బుకింగ్ సేల్స్ 2017 నుంచి 2021 నాటికి 14.8 శా తం పెరగనుందని నివేదికలు అంచనా. 2019 నాటికి ప్రపంచంలో ఆరవ అతిపెద్ద బిజినెస్ ట్రావెల్ మార్గెట్‌గా భారత్ నిలువనుందని పేర్కొన్నాయి.

Comments

comments