Home తాజా వార్తలు తండ్రి చేతిలో ఇద్దరు చిన్నారుల హత్య

తండ్రి చేతిలో ఇద్దరు చిన్నారుల హత్య

Murderసంగారెడ్డి: రామచంద్రాపురం బొంబై కాలనీలో దారుణ ఘటన జరిగింది. తన భార్యపై ఉన్న కోపంతో ఓ కన్న తండ్రి తన  బిడ్డలనే హతమార్చాడు. ఈ దారుణ ఘటనలో ఇద్దరు చిన్నారులు మృతిచెందారు. మరో చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. ఓ వ్యక్తి తరచూ తన భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో మద్యానికి బానిసైన సదరు వ్యక్తి భార్యపై భౌతిక దాడి సైతం చేసేవాడు. దీంతో మనస్తాపానిక గురైన ఆయన భార్య నెల రోజుల క్రితం పుట్టింటికి వెళ్లిపోయింది. ఈ క్రమంలో సదరు నిందితుడు తన భార్యపై కోపం పెంచుకున్నాడు. మంగళవారం రాత్రి తన కొడుకు అఖిల్ (7), కూతురు శరణ్య(4)లకు ఉరేసి హత్య చేశాడు. మరో  కూతురు మల్లీశ్వరి (10)పై కత్తితో దాడి చేశాడు. మల్లీశ్వరి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పోస్టుమార్టం కోసం అఖిల్, శరణ్య మృతదేహాలను ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనలో నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

2 Children Murder by Father in Sangareddy