Home అంతర్జాతీయ వార్తలు అమెరికాలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

అమెరికాలో కాల్పుల కలకలం: ఇద్దరు మృతి

seattle-Shooting

సియాటెల్‌: గుర్తుతెలియని దుండగుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు మృతి చెందిన సంఘటన అమెరికాలోని సియాటెల్‌ పట్టణంలో చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రస్తుతం గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. వివరాలలోకి వెళితే.. సియాటెల్‌ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఈశాన్య సియాటెల్ ప్రాంతంలో నివసించే ఓ దుండగుడు బుధవారం తుపాకీతో వీధుల్లోకి ప్రవేశించాడు. కారులో ప్రయాణిస్తున్న ఓ మహిళను అపహరించేందుకు యత్నించి ఆమెపై తుపాకీతో కాల్పులు జరిపాడు.దీంతో ఆ మహిళ సంఘటనా స్థలంలోనే కుప్పకూలిపోయింది.

స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న భద్రతా సిబ్బంది గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. అనంతరం అక్కడి నుంచి తప్పించుకునే ప్రయత్నంలో నిందితుడు అటుగా వస్తున్న మరో మెట్రో బస్సుపై కాల్పులు జరిపాడు. దీంతో బస్సు డ్రైవర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. అనంతరం దుండగుడు మరో కారుపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆ కారు డ్రైవర్‌ ఘటనస్థలిలోనే మృతి చెందాడు.  పోలీసులు అతణ్ని వెంబడించి అదుపులోకి తీసుకున్నారు. నిందుతడిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ ప్రారంభించారు.

2 dead and 4 wounded in Seattle shooting