Search
Sunday 23 September 2018
  • :
  • :
Latest News

ట్రక్కు చక్రాల మధ్య 2 గంటల పాటు నరకయాతన

వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డిసితండా వద్ద ప్రమాదంలో బతికి బయటపడ్డ యువకుడు 

Accident-1

వరంగల్ క్రైం: మృత్యువుతో రెండు గంటలకు పైగా పోరాడి ఆ యువకుడు విజయం సాధించాడు. పొలం పనులు ముగించుకుని తన ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా మృత్యువు వ్యాన్ రూపంలో వచ్చి మరణ అంచుల్లోకి తీసుకెళ్లింది. పిలుద్దామంటే మాట రాదు.. కాపాడడానికి ఎవరు అందుబాటులో లేరు… వ్యాన్ (ట్రక్) రెండు చక్రాల మధ్యలో ఇరుక్కుని సుమారు రెండు గంటల పాటు ముత్యువుతో పోరాడి బయటపడ్డాడు. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం… వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండలం డి.సి తండాకు చెందిన ఆంబోతు వెంకన్న,  శ్రీనివాస్‌లు కలిసి బుధవారం ఉదయం బైక్‌పై పొలం వద్దకు వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా వర్ధన్నపేట ప్రధాన రహదారిపై వస్తున్న వ్యాన్ (ట్రక్) ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. బైక్ వెనుకాల కూర్చున్న శ్రీనివాస్‌కు తీవ్రగాయాలు కాగా, బైక్ నడుపుతున్న వెంకన్న వ్యాన్ రెండు చక్రాల మధ్యలో ఇరుక్కుపోయాడు. దీంతో గమనించిన గ్రామస్థులు గాయాలు తగిలిన శ్రీనివాస్‌ని ఎంజిఎం ఆసుపత్రి కి తరలించారు.  వ్యాన్ మధ్యలో ఇరుక్క పోయిన వెంకన్నను తీయడానికి చేసిన ప్రయత్నం ఫలించక పోవడంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రెండు జెసిబిలు, ఒక క్రేను పిలిపించి రెండు గంటల పాటు శ్రమించి ఎట్టకేలకు వెంకన్నను ప్రాణాలతో బయటకు తీసి ఎంజిఎం ఆసుపత్రికి తరలించారు. వర్ధన్నపేట సిఐ వేణుచందర్, ఎస్‌ఐపి. ఉపేందర్‌రావు, రాయపర్తి ఎస్‌ఐ శ్రీధర్, కానిస్టేబుళ్లు శ్రీనివాస్, రాజు, లకుపతి నాయక్, ప్రతీణ్‌లు అరుదైన ఈ ప్రాణ రక్షణ కృషిలో పాల్గొన్నారు

Comments

comments