Search
Friday 16 November 2018
  • :
  • :
Latest News

ఫోర్బ్స్ జాబితాలో ఇద్దరు భారతీయులు

సంపన్న యువ పారిశ్రామివేత్తల్లో రామస్వామి,మెహతాలకు చోటు

మొదటి స్థానంలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు

indiansన్యూయార్క్: ప్రముఖ మ్యాగజైన్ ఫోర్బ్ విడుదల చేసిన నలబై ఏళ్లలోపు సంపన్న వ్యాపారవేత్తల జాబితాలో ఇద్దరు భారతీయులు చోటుదక్కించు కున్నారు. ఈ జాబితాలో ఫేస్‌బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జుకర్‌బర్గ్ మొదటి స్థానంలో నిలిచాడు. భారత్‌కు చెందిన బయోటెక్ పారిశ్రామికవేత్త వివేక్ రామస్వామి 24వ స్థానం దక్కించుకోగా, ఆయన మొత్తం సంపద విలువ 600 మిలియన్ డాలర్లుగా ఉంది. ఇక అపూర్వ మెహతా 360 మిలియన్ డాలర్ల సంపదతో 31 స్థానాన్ని దక్కిం చుకున్నారు. 31 ఏళ్ల రామస్వామి హార్వర్డ్ విశ్వ విద్యాలయం, యేల్ స్కూల్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లో విద్యను అభ్యసించారు. బయోటెక్ రంగంలో కంపెనీని స్థాపించి వృద్ధి పథంలో దూసుకు పోతున్నారని ఫోర్బ్ పేర్కొంది. 2016లో పబ్లిక్ ఆఫర్(ఐపిఒ)కు వచ్చిన మైయోవంట్ సైన్స్ అక్టోబర్‌లో నాస్‌డాక్‌లో షేర్ల లిస్టింగ్ ద్వారా 218 మిలియన్ డాలర్ల షేర్లను సేకరిం చింది. ఇక మెహతా సిలికాన్ వ్యాలీలోని యువ పారిశ్రామిక వేత్తల్లో ఒకరు గా నిలిచారని ఫోరబ్స్ అభివర్ణిం చింది. సిలికాన్ వ్యాలీ యువ వలసవాదుల విజయగాథలో మెహతా పేరును ఫోర్బ్ పేర్కొంది. భారత్‌లో జన్మించిన మెహతా కుటుంబం 2000 సంవత్సరంలో కెనడాకు వెళ్లింది. బ్లాక్‌బెర్రీ, క్వాల్కామ్, ఆ తర్వాత అమెజాన్‌లలో పనిచేయ డానికి ముందు మెహతా వాటర్లూ విశ్వవిద్యాల యంలో విద్యనభ్య సించారు. 2012లో నిత్యా వసరాలను సరఫరా చేసే సంస్థ ‘ఇన్‌స్టాకార్ట్’ వ్యవ స్థాపకుల్లో ఒకరిగా ఉన్నారు. 10 డాలర్లు చెల్లిం చడం ద్వారా రెండు గంటల్లోపు నిత్యావసర సరకులను పొందవచ్చు. మెహతా నిర్వహిస్తున్న ఈ కంపెనీ విలువ 2 బిలియన్ డాలర్లు అని ఫోర్బ్ తెలిపింది. ఈ జాబితాలో తొలిస్థానంలో నిలిచిన జుకర్‌బర్గ్ ఆస్తుల విలువ 50 బిలియన్ డాలర్లుగా ఉంది.

Comments

comments