Search
Wednesday 14 November 2018
  • :
  • :
Latest News

ఉత్తరప్రదేశ్‌లో రూ.2 లక్షల కోట్ల రోడ్డు ప్రాజెక్టు: నితిన్ గడ్కరీ

Nitin-Gadkariవారణాసి: మరో రెండేళ్లలో ఉత్తరప్రదేశ్‌లో రూ. 2 లక్షల కోట్లతో రోడ్డు ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టనున్నట్లు కేంద్ర రోడ్డు రవాణ, హైవేస్, నావికా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ శుక్రవారం ప్రకటించారు. ఉత్తరప్రదేశ్‌లో వచ్చే సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ఆయన ఈ ప్రకటన ప్రాధాన్యతను సంతరించుకుంది. ఇప్పటికే తాము 60,000 కోట్ట ప్రాజెక్టులను కొనసాగిస్తున్నామని మరో రెండు సంవత్సరాలలో ఉత్తర ప్రదేశ్‌లో రూ. 2 లక్షల కోట్ల  రోడ్డు ప్రాజెక్టును చేపట్టనున్నామని ఆయన తెలిపారు. ఆయన వారణాసి- జౌన్‌పూర్ జాతీయ రహదారి, వారణాసి-ఆజంగఢ్ జాతీయ రహదారి, వారణాసి-ఘాజీపూర్ జాతీయర రహదారి స్ట్రెచ్‌లకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ మార్గాల రోడ్డు నిర్మాణం పనులు 2018 జూన్ నాటికి పూర్తి కానున్నాయి. రాబోయే పార్లమెంటు సమావేశంలో కొత్త మోటారు బిల్లు ఆమోదింపజేస్తామని కూడా ఆయన తెలిపారు. ప్రతి రోజూ 500 రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని,  కొత్త చట్టం అమలులోకి వస్తే వీటి సంఖ్య చాలా వరకు తగ్గగలదన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అంగీకారం, 18 రాష్ట్రాల రవాణ మంత్రుల సిఫార్సులతో ఈ కొత్త బిల్లు ముసాయిదాను రూపొందించినట్లు ఆయన తెలిపారు. ట్రాఫిక్ నియమాలు ఉల్లంఘించేవారికి, మత్తు పానీయాలు సేవించి వాహనాలు నడిపేవారికి కొత్త చట్టం ద్వారా భారీ జరిమానాలు విధించనున్నామని ఆయన చెప్పారు.

Comments

comments