Search
Tuesday 25 September 2018
  • :
  • :
Latest News

2 లక్షల అన్నార్థుల ఆకలి తీర్చనున్న క్వికర్

quaker2
మన తెలంగాణ / హైదరాబాద్ : అన్నార్థుల ఆకలిని తీర్చేందుకు ఉద్దేశించిన గుప్పెడు బియ్యం సేకరణ స్ఫూర్తిగా క్వికర్ సంస్థ ఆకలిగొన్న ప్రతి బిడ్డకు ఉడతాభక్తితో భుక్తిని తీర్చేందుకు ముందుకు వచ్చింది. ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకని ఆకలి, దారిద్యంతో ఉన్న అన్నార్థులకు ఒక పూట భోజనం ఉచితంగా అందజేస్తున్నట్లు వెల్లడించింది. ప్రముఖ చెఫ్, పెప్సికో న్యూట్రిషన్ రాయబారి వికాస్ ఖన్నాతో కలిసి సుమారు 2 లక్షల మంది చిన్నారుల ఆకలి తీర్చేందుకు ఈ సిఎస్‌ఆర్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు క్వికర్ పేర్కొంది.

Comments

comments