Home తాజా వార్తలు బాఘీకి 2మిలియన్ వ్యూస్

బాఘీకి 2మిలియన్ వ్యూస్

BAAGHI-3ముంబయి : బాలీవుడ్ నటులు టైగర్ ష్రాఫ్, శ్రద్ధా కపూర్‌లు జంటగా నటించిన చిత్రం బాఘీ. ఈ చిత్ర ట్రైలర్ మంగళవారం మొదలైంది. ఒక్కరోజులోనే 20 లక్షల మంది యూట్యూబ్‌లో ఈ ట్రైలర్‌ను వీక్షించారు. తెలుగులో వచ్చిన వర్షం చిత్రానికి ఈ సినిమా రీమేక్. ట్రైలర్‌లో టైగర్ సుమారు 30 సార్లు ఫ్లైయింగ్ కిక్స్ ప్రదర్శించి ఆకట్టుకున్నాడు. సబీర్‌ఖాన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రలో తెలుగు నటులు సుధీర్‌బాబు, కోట శ్రీనివాసరావు నటిస్తున్నారు. ఏప్రిల్ 29న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.