రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లా భేజి పిఎస్ పరిధిలో భద్రతా బలగాలు, మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు జవాన్లు మృతి చెందారు. మరో ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు తెలిపారు. వీరిని సమీపంలోని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం భద్రతా బలగాలకు, మావోయిస్టులకు మధ్య ఎదురుకాల్పులు కొనసాగుతున్నట్లు సమాచారం.