Home జాతీయ వార్తలు కాల్పుల్లో ఇద్దరు మృతి

కాల్పుల్లో ఇద్దరు మృతి

2 Shot Dead in UP

లక్నో : యుపిలోని వారణాసిలో బుధవారం సాయంత్రం కాల్పుల ఘటన కలకలం రేపింది. ఇక్కడి కంటోన్మెంట్ పోలీసు స్టేషన్ పరిధిలో ఆగంతకుడు జరిపిన కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారి పరిస్థితి విషమంగా ఉండడంతో ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో వారణాసిలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాల్పులు జరిపిన అగంతుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. శవపరీక్ష కోసం మృతదేహాలను ఆస్పత్రికి తరలించామని, ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు వెల్లడించారు.

2 Shot Dead in UP