Home సినిమా కాన్సెప్ట్ అలాగే… మిగతా అంతా కొత్తగా

కాన్సెప్ట్ అలాగే… మిగతా అంతా కొత్తగా

cini

టాలీవుడ్‌లో ఈమధ్య కాలంలో థ్రిల్లర్ జోనర్‌లో వచ్చిన సినిమాల్లో ప్రేక్షకులను బాగా మెప్పించిన సినిమా ‘క్షణం’. అడవి శేష్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా తక్కువ బడ్జెట్‌లోనే తెరకెక్కి బ్రహ్మాండమైన వసూళ్లను రాబట్టింది. ఈ మూవీని తాజాగా బాలీవుడ్‌లో ‘బాఘీ 2’ పేరుతో రీమేక్ చేశారు. టైగర్‌ష్రాఫ్, దిశా పఠాని హీరోహీరోయిన్లుగా నటించిన ఈ మూవీ చూసిన వారెవరైనా ఇది ‘క్షణం’ మూవీ రీమేక్ అని చెబితే తప్ప నమ్మరు. సెంటిమెంట్ బేస్డ్ థ్రిల్లర్ మూవీని యాక్షన్ ప్యాక్‌డ్ ఎంటర్‌టైనర్‌గా మార్చేశారు. హిందీలో ‘బాఘీ 2’ను నిర్మించిన సాజిద్ నడియావాలా ‘క్షణం’ రీమేక్ రైట్స్‌కు ప్రత్యేకంగా డబ్బులేమీ ఇవ్వలేదు. దానికి బదులుగా అర్జున్‌కపూర్, అలియాభట్ జంటగా నటించిన ‘2 స్టేట్స్’ తెలుగు రీమేక్ రైట్స్ ఇచ్చాడు. ఇప్పుడు రాజశేఖర్ కూతురు శివానీ హీరోయిన్‌గా అడవిశేష్ అదే టైటిల్‌తో సినిమా చేస్తున్నాడు. హిందీలో ‘క్షణం’ రీమేక్‌ను ఎలా మార్చేశారో తెలుగులో ‘2 స్టేట్స్’ను కూడా మొత్తం మార్చేస్తున్నారు. కాన్సెప్ట్‌ను మాత్రం అలాగే ఉంచి మిగతా అంతా కొత్తగా తీస్తున్నారు. బాలీవుడ్‌లో పంజాబీ అబ్బాయి, తమిళమ్మాయి మధ్య ఫ్రెష్ ప్రేమ కథగా ‘2 స్టేట్స్’ ప్రేక్షకులను మెప్పించింది.