Home అంతర్జాతీయ వార్తలు రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు లభ్యం

రెండో ప్రపంచ యుద్దం నాటి బాంబు లభ్యం

2 World War Bomb Find Out at Kolkataకోల్‌కతా : రెండో ప్రపంచ యుద్ధ కాలంనాటి బాంబు బయటపడింది. ఈ ఘటన పశ్చిమ బెంగాల్‌లో జరిగింది. కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌ రేవు బెర్త్‌-2 వద్ద ఆదివారం ఉదయం తవ్వకాలు చేశారు. ఈ తవ్వకాల్లో ఈ బాంబు బయటపడింది. ముందుగా దీనిని టార్పెడోగా భావించారు. కానీ నౌకాదళం ఏరియల్‌ ఇది రెండో ప్రపంచ యుద్ధం నాటి బాంబుగా నిర్ధారించింది. బాంబు లాక్‌ అయి ఉందని, ఈ బాంబు వల్ల ఎటువంటి ప్రమాదం లేదని అధికారులు చెప్పారు. దీంతో ఆ ప్రాంత ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. బాంబు 4.5 మీటర్ల పొడవు, 453 కిలోల బరువు కలిగి ఉందని అధికారులు తెలిపారు. యుద్ధ విమానాలకు తగిలించేందుకు వీలుగా ఈ బాంబును రూపొందించారు. ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ అధికారుల సహాయంతో బాంబును నిర్వీర్యం చేస్తామని స్థానిక అధికారులు చెప్పారు. అవసరమైతే విశాఖపట్నం నేవీ అధికారుల సహాయం తీసుకుంటామని నౌకదళం ఇంచార్జ్‌ కమోడోర్ సుప్రోభో కె దే మీడియాకు తెలిపారు.

2 World War Bomb Find Out at Kolkata